తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేజ్​ బహదూర్ కేసులో సుప్రీం తీర్పు నేడు - బీఎస్​ఎఫ్ జవాన్ తేజు బహదారు కేసులో సుప్రీం తీర్పు

2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా బీఎస్​ఎఫ్ జవాన్ తేజ్​ బహదూర్ వేసిన ఎన్నికల నామినేషన్​ తిరస్కరణ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది. బహదూర్​ పిటిషన్​పై సుప్రీం కోర్టు ఈ నెల 18నే తీర్పు రిజర్వు చేసింది.

Verdict on BSF Jawan Tej Bahadur case
బీఎస్​ఎస్ జవాన్ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ కేసు

By

Published : Nov 24, 2020, 6:08 AM IST

బీఎస్​ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ ఎస్​.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 18న బహదూర్ పిటిషన్​పై తీర్పు రిజర్వు చేసింది.

ఏమిటి కేసు?

2019 ఎన్నికల్లో తేజ్ బహదూర్​ ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసిలో పోటీకి నామినేషన్ వేశారు. సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా తేజ్​ బహదూర్​ నామపత్రం సమర్పించారు. ఉద్యోగ కాలంలో ఎలాంటి రాజద్రోహం, అవినీతికి పాల్పడలేదన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలని బహదూర్​ను కోరింది ఎన్నికల సంఘం. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించనందున ఆయన నామినేషన్​ను 2019 మే 1న తిరస్కరించారు రిటర్నింగ్​ అధికారి. అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్​ హై కోర్టును ఆశ్రయించారు బహదూర్​. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీనితో సుప్రీంను ఆశ్రయించారు బహదూర్. ఇరు పక్షాల వాదనను విన్న సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది.

బహదూర్​ వీడియో వివాదం..

గతంలో సరిహద్దు భద్రతా దళ సైనికుడిగా పనిచేసిన బహదూర్​.. సైనికులకు వడ్డించే ఆహారంపై ఫిర్యాదు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. ఫలితంగా 2017లో ఆయన్ను ఉద్యోగం నుంచి తప్పించారు అధికారులు.

ఇదీ చూడండి:బంగాల్​ దంగల్​: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!

ABOUT THE AUTHOR

...view details