తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాగు చట్టాలను నిలిపివేస్తారా? లేక మేమే చేయాలా?' - New agriculture laws

The farmers are protesting since November last year at various border points of Delhi against three new farm laws enacted by the government in September last year.

SC to hear pleas on farm laws, ongoing farmers' agitation today
సాగు చట్టాలు, రైతు ఆందోళనపై సుప్రీంలో ప్రారంభమైన విచారణ

By

Published : Jan 11, 2021, 12:22 PM IST

Updated : Jan 11, 2021, 1:43 PM IST

13:37 January 11

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం చర్య పట్ల తాము నిరాశతో ఉన్నామని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా లేదా కోర్టునే ఆ పని చేయమంటారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. 

"సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియ పట్ల అసంతృప్తిగా ఉన్నాం. అసలు చర్చల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.  అసలేం జరుగుతోంది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం కోరుకోవట్లేదు"

              - సీజేఐ జస్టిస్‌ బోబ్డే 

దేశమంతా సాగు చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉందని ధర్మాసనం పేర్కొంది. చట్టాల్ని రద్దు చేయాలని తాము చెప్పడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని చెప్పింది. చట్టాల్ని కొంతకాలం నిలివేయగలరా..? అని సర్కార్​ను ప్రశ్నించింది. చట్టాలు ప్రయోజకరమేనని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ కూడా కన్పించట్లేదని వ్యాఖ్యానించింది.  సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ తన నివేదిక ఇచ్చే వరకు వ్యవసాయ చట్టాల్ని నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ధర్మాసనం వెల్లడించింది. 

ఇక రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, ఆందోళనను మరో చోటు మార్చుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.  రైతులు తమ ఇబ్బందులను కమిటీకి తెలియజేయాలని, వాటిని కోర్టు పరిశీలిస్తుందని వెల్లడించింది. 

చట్టాల్ని నిలిపివేయడం సాధ్యం కాదు..

చట్టాలను నిలిపివేయడం కుదరదని, అయితే దీనిపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయొచ్చని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు న్యాయస్థానాలకు లేదు అని ఆయన చెప్పారు. సుప్రీం గత తీర్పులు కూడా ఇదే చెబుతున్నాయని గుర్తుచేశారు. అంతేగాక కొత్త చట్టాలపై యావత్ దేశం సంతృప్తిగా ఉందని, కేవలం రెండు, మూడు రాష్ట్రాల వారే ఆందోళన చేస్తున్నారని వివరించారు. 

12:46 January 11

రైతులు తమ ఇబ్బందులను కమిటీకి చెప్పాలి : సీజేఐ

నూతన వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కొనసాగించకూడదనుకుంటే.. దానిపై స్టే విధిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సాగు చట్టాల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.  

నూతన చట్టాలకు కేంద్రం బాధ్యత వహించాలన్న ధర్మాసనం ' మీరు(కేంద్రం) చట్టాలను తీసుకొచ్చారు. వీటిని మంచి పద్ధతిలో చేయవచ్చు" అని పేర్కొంది. చట్టాలు రూపొందించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు జస్టిస్​ బోబ్డే. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలు, సాగు చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ.  

  • రోజు రోజుకు పరిస్థితి దిగజారుతోందని స్పష్టంగా చెప్పగలం: సీజేఐ
  • శాంతి యుత పరిస్థితులు విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న : సీజేఐ
  • సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలని పలువురు న్యాయవాదులు సూచిస్తున్నారు: సీజేఐ
  • నిరసనల్లో ఎవరూ తీర్పు చదవరు అని వ్యాఖ్యానించిన : సీజేఐ
  • ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది : సీజేఐ
  • ఈ రోజు వరకు ఆ పరిస్థితి లేదు.. రైతులు తమ ఇబ్బందులను కమిటీకి తెలియజేస్తే.. ఆ నివేదికను పరిశీలిస్తాం : సీజేఐ
  • కమిటీ తన నివేదిక ఇచ్చేవరకు వ్యవసాయ చట్టాన్ని నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నాం : సీజేఐ
  • అవసరమైతే సాగు చట్టాల అమలుపై స్టే ఇస్తాం : సుప్రీంకోర్టు
  • చట్టం ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిరోధించలేమని కోర్టుకు తెలిపిన ఏజీ
  • కానీ ఈ చట్టం ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకం అని ఏ పిటిషన్‌లోనూ ప్రస్తావించలేదన్న ఏజీ
  • ఏదో ఒక రోజు అక్కడ హింస చెలరేగవచ్చని మేము భయపడుతున్నాం: సీజేఐ
  • సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం తీసుకురాగలమా అని చూడడమే మా ఉద్దేశం : సీజేఐ
  • అందుకే మీ చట్టాలను అమలు చేయవద్దని మేము మిమ్మల్ని కోరారు : సీజేఐ
  • ప్రతిది ఒక ఆర్డర్ ద్వారా చేయమని చెప్పలేము : సీజేఐ
  • ఎవరూ ఆందోళన చేయరని కూడా చెప్పలేము : సీజేఐ
  • అలా చేయవద్దు అని మాత్రమే చెప్పగలం : సీజేఐ
  • ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మేము రక్షిస్తామని చెప్పలేదన్న ధర్మాసనం
  • మేము హింస జరగకుండా ఆపాలనుకుంటున్నామన్న ధర్మాసనం
  • జనవరి 26 న రాజ్‌పథ్‌లో రైతులు ట్రాక్టర్లను కవాతు చేస్తారని ప్రకటించారన్న ఏజీ
  • ఇది గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు కలిగించే ఉద్దేశం అన్న ఏజీ
  • దిల్లీలోకి ఎవరూ రాకుండా చూసుకోవడం పోలీసులు పని.. కోర్టు పని కాదన్న సీజేఐ
  • మా విమర్శలను పునరావృతం చేయకూడదనుకుంటున్నాం: సీజేఐ
  • మిస్టర్ వేణుగోపాల్ మీరు పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తున్నారని అనుకోమని వ్యాఖ్యానించిన సీజేఐ
  • ఈ రోజు మేము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : సీజేఐ
  • ఎందుకంటే మీరు దీన్ని సమర్ధవంతంగా పరిష్కరిస్తారనే నమ్మకం లేదు : సీజేఐ
  • జనవరి 15న తిరిగి రైతులతో సమావేశమవుతున్నాము. అప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరిన ఏజీ
  • విమర్శించడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ మీరు ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించడం లేదని అంటున్నాం : సీజేఐ
  • ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాలు అమలు చేయడాన్ని నిషేధిస్తున్నాం : సీజేఐ
  • మొత్తం చట్టాలను నిషేధించం : సీజేఐ
  • అటార్నీ జనరల్ అభ్యర్ధనలను పరిగణించాం : సీజేఐ
  • చట్టం ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు అన్న : సీజేఐ
  • పంజాబ్ రైతులు రిపబ్లిక్ డే పరేడ్‌కు అంతరాయం కలిగించాలని ఎప్పుడూ కోరుకోరన్న  రైతుల తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే
  • ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తులు సైన్యంలోని ఉన్నారు : దుష్యంత్‌
  • రామ్‌లీలా మైదాన్‌కు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాల్లి : దుష్యంత్‌
  • చట్టాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళన రక్త సిక్తం అయితే.. బాధ్యులు ఎవరు.. బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించిన సీజేఐ
  • అలాంటి పరిస్థితిని నివారించడం మా కర్తవ్యం : సీజేఐ
  • ప్రభుత్వం నిజంగా తీవ్రంగా ఉంటే అది పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నించిన రైతుల తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే
  • చట్టం అమలు నిలిపివేస్తే రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు మంచి వాతావరణంలో జరుగుతాయని వ్యాఖ్యానించిన సీజేఐ

12:44 January 11

  • వ్యవసాయ చట్టాలపై సందిగ్ధతకు ముగింపు పలికేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామన్న సీజేఐ
  • ఒక చట్టాన్ని కొనసాగించడం అంత సులభం కాదు కాని.. కోర్టు చాలా సందర్భాలలో స్పష్టం చేసింది: సీజేఐ
  • విషయం రోజు రోజుకు మరింత దిగజారిపోతోంది : సీజేఐ
  • రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు : సీజేఐ
  • చలిలో తీవ్రంగా బాధపడుతున్నారు: సీజేఐ
  • రైతులు, వృద్ధులను ఆందోళనలో ఎందుకు ఉంచుతున్నారో మాకు అర్థం కాలేదు : సీజేఐ
  • దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవే చట్టాలు అమలు జరుగుతున్నాయని, ఇక్కడ సమస్య దేశంలో అందరికి కాదని, కేవలం ఆందోళన చేస్తున్న వారిది మాత్రమే కోర్టుకు తెలిపిన సొలిసిటర్‌ జనరల్‌

12:23 January 11

  • కేంద్ర ప్రభుత్వం చర్యల పట్ల నిరాశతో ఉన్నామన్న సుప్రీంకోర్టు
  • దేశమంతా.. మీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉంది: సుప్రీంకోర్టు
  • రైతులతో ఏం మాట్లాడుతున్నారని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించిన సుప్రీం
  • చట్టాన్ని రద్దు చేయాలని మేం చెప్పట్లేదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు
  • కోర్టు జోక్యం చేసుకోవాలా వద్దా అనే దానిపై అర్ధంలేని వాదనలు వింటున్నాం: సుప్రీంకోర్టు
  • కోర్టు లక్ష్యం సమస్యకు పరిష్కారం కనుగొనడం: సుప్రీంకోర్టు
  • మీరు చట్టాన్ని కొంతకాలం నిలిపివేయగలరా?: సుప్రీంకోర్టు
  • ప్రయోజనకరమనేందుకు ఒక్క కేసు కూడా మన ముందులేదు: సుప్రీంకోర్టు
  • సమస్య పరిష్కారం కోసం చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఏజీ
  • సందిగ్ధతకు ముగింపు పలికేందుకు కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం: సుప్రీంకోర్టు

12:13 January 11

లైవ్​: సుప్రీంలో ప్రారంభమైన విచారణ

  • వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • విచారణ కొనసాగిస్తున్న ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం
  • కేంద్ర ప్రభుత్వం చర్యల పట్ల నిరాశతో ఉన్నామన్న సీజేఐ
  • దేశమంతా.. మీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉంది: సీజేఐ
  • మీరు చర్చలు జరుపుతున్నామని చెప్పారు.. ఏమి మాట్లాడుతున్నారని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ని ప్రశ్నించిన సీజేఐ
Last Updated : Jan 11, 2021, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details