తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్​పై సుప్రీం విచారణ - sc civils news

గతేడాది సివిల్ సర్వీసు పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలన్న పిటిషన్​ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. మరోసారి పరీక్షకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.

civils supreme court
సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్​పై సుప్రీం విచారణ

By

Published : Jan 25, 2021, 5:15 AM IST

కరోనా కారణంగా గతేడాది యూపీఎస్​సీ సివిల్ సర్వీసు ప్రాథమిక పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు విననుంది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురళిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించనుంది.

చివరి ప్రయత్నంలో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేనందున సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై ప్రాధాన్యం ఏర్పడింది.

అక్టోబర్ 4న సివిల్ సర్వీసుల ప్రాథమిక పరీక్ష జరిగింది. దేశంలో కరోనా, వరదల ప్రభావం ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని అప్పుడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే వయసు పరిమితులు ఉన్న నేపథ్యంలో తమ చివరి ప్రయత్నంగా పరీక్ష రాయాలనుకున్నవారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తుది నిర్ణయం ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:యూపీఎస్​సీ ఆశావహులకు కేంద్రం షాక్​!

ABOUT THE AUTHOR

...view details