తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్ రగడపై సుప్రీంలో విచారణ

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై తాజా ఆరోపణల నేపథ్యంలో కొత్తగా దాఖలైన పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

Rafale
రఫేల్

By

Published : Apr 13, 2021, 6:14 AM IST

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం కొద్ది రోజుల క్రితం మరోసారి వివాదాస్పదమైంది. తాజా ఆరోపణల నేపథ్యంలో కొత్తగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రెండు వారాల తర్వాత సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంటోంది. దాదాపు వారం రోజుల క్రితం మరోసారి దానిపై సంచలన కథనం వెలువడింది. ఈ విమానాల తయారీదారు దసో ఏవియేషన్ భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి 10,17,850 యూరోల (రూ.8.8 కోట్లు)ను చెల్లించినట్లు ఫ్రెంచ్‌ పోర్టల్ ‘మీడియా పార్ట్‌’లో కథనం ప్రచురితమైంది. ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు పేర్కొంది.

దసో సంస్థలో అవినీతి నిరోధక విభాగం అడిట్ చేసినప్పుడు ఈ విషయం వెల్లడైందని తెలిపింది. కాగా, ఫ్రెంచ్ పత్రిక కథనం నేపథ్యంలో రఫేల్ ఒప్పందంపై పూర్తిస్థాయి, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే అధికార భాజపా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. దసో ఏవియేషన్ కూడా వాటిని ఖండించింది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016లో భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:'రఫేల్​పై స్వతంత్ర దర్యాప్తు జరపాలి'

ABOUT THE AUTHOR

...view details