తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరమ్​వీర్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ - ఐపీఎస్​ బ్యాచ్​

మహారాష్ట్ర హోం మంత్రి​ అవినీతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ ముంబయి మాజీ సీపీ పరమ్​వీర్​ సింగ్​ దాఖలు చేసిన పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తన బదిలీని కూడా రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

SC to hear Mumbai ex-CP's plea
ముంబయి మాజీ సీపీ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

By

Published : Mar 24, 2021, 6:28 AM IST

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు జరిపించాలంటూ ముంబయి మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ వేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.

తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు దేశ్‌ముఖ్ ఇంటి సీసీటీవీ ఫుటేజీలను సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సాక్ష్యాలను నాశనం చేయకముందే మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్​లో విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్​ ఆర్​ఎస్​ రెడ్డి సభ్యులుగా గల ధర్మాసనం ఈ వ్యాజ్యం పరిశీలించనుంది.

'బదిలీ రద్దు చేయండి'

1988 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన పరమ్​వీర్.. ముంబయి సీపీగా ఉన్న తనను హోం గార్డ్స్​ విభాగానికి ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని, దాన్ని రద్దు చేయాలని పిటిషన్​లో కోరారు.

సోమవారం ఆయన హోం గార్డ్స్​ చీఫ్​ బాధ్యతలను స్వీకరించారు.

నెలకు రూ. 100 కోట్లు సంపాదించాలని పోలీసులకు.. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆదేశాలు జారీ చేశారని ఇటీవల ఆరోపించారు పరమ్​వీర్​. దీనిపై సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు లేఖ రాయడం పెద్ద దుమారం రేపింది.

ఇదీ చూడండి:'మహా'లో లేఖ రచ్చ- ఠాక్రే సర్కార్​పై ఒత్తిడి!

ABOUT THE AUTHOR

...view details