తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రధానిపై చైనా నిఘా' పిటిషన్ జనవరిలో సుప్రీంకు

రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులపై చైనా నిఘా వేసి ఉంచిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్​పై.. జనవరిలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కొత్త సంవత్సర సెలవుల తర్వాత దీనిపై వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

SC to hear in Jan plea seeking probe into China's alleged surveillance on President, PM, judges
'ప్రధానిపై చైనా నిఘా' పిటిషన్ జనవరిలో సుప్రీంకు

By

Published : Dec 20, 2020, 9:20 AM IST

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమూర్తులు సహా ప్రముఖులపై చైనా నిఘా వేసి ఉంచుతోందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్​ విచారణ తేదీని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరిలో దీనిపై వాదనలు విననున్నట్లు తెలిపింది. 'క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఈ కేసును తమ దృష్టికి తీసుకురావాల'ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

ఇదీ చదవండి:చైనా మరో కుట్ర- ప్రముఖులపై నిఘా!

'సేవ్ ​దెమ్ ఇండియా ఫౌండేషన్' అనే ఎన్​జీఓ ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సైబర్ ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఐటీ చట్టం, ఐపీసీ ప్రకారం దీనిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. దీంతోపాటు చైనా కేంద్రంగా పనిచేసే డిజిటల్ లోన్ యాప్​లను భారత్​లో నిషేధించాలని కోరింది. విరుద్ధ పద్ధతులు పాటిస్తున్న ఎన్​బీఎఫ్​సీలు, లోన్ యాప్​లపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

"మనీ లెండింగ్ యాప్​లతో పాటు చాలా మార్గాల్లో భారతీయుల సమాచారాన్ని చైనా కొల్లగొడుతోంది. భవిష్యత్తులో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దేశ భద్రత, సమగ్రతకు విఘాతం కలిగిస్తుంది. దేశ రాష్ట్రపతి, ప్రధాని, వేలాది మంది అధికారుల రహస్యాలు, పౌరుల గోప్యతతో చైనా ఆటలాడుతోంది."

-సేవ్ దెమ్ ఇండియా పిటిషన్​

దేశంపై చైనా గూఢచర్యం చేయడం వల్ల విలువైన సమాచారం కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేసింది సేవ్​దెమ్ ఇండియా.

ఇదీచదవండి:'మోదీజీ... మనపై చైనా నిఘా సంగతేంటి?'

ABOUT THE AUTHOR

...view details