తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పీళ్ల నమోదుపై ఉన్న కాలపరిమితి పొడగింపు - SC LIMITATION filing appeals

అప్పీళ్ల నమోదుపై ఉన్న కాలపరిమితిని తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు పొడగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీం. అటార్నీ జనరల్ సమర్పించే నివేదికను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ ఎన్​వీ రమణ తెలిపారు.

SC to extend period of limitation for filing appeals
అప్పీళ్ల నమోదుపై ఉన్న కాలపరిమితి పొడగింపు

By

Published : Apr 27, 2021, 4:03 PM IST

కరోనా రెండో దశ వ్యాప్తి.. దేశంలో ఆందోళకరమైన పరిస్థితిని తీసుకొచ్చిందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. కేసుల పెరుగుదల వల్ల న్యాయవాదులపై ప్రతికూల ప్రభావం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అప్పీళ్ల నమోదుపై ఉన్న కాల పరిమితిని పొడగించాలని నిర్ణయించింది. మార్చి 14తో ముగిసిన అన్ని పరిమితులను తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సమర్పించే నివేదికను పరిశీలించి దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

సుప్రీంకోర్టు తన అధికారాలను ఉపయోగించి గతేడాది మార్చి 15న.. అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఉన్న కాల పరిమితిని పొడగించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితిని పూర్వస్థితికి తీసుకురావాలని సుప్రీం గతంలో భావించినప్పటికీ.. కరోనా కేసులు మళ్లీ పెరిగిన కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి-స్టెరిలైట్​ పరిశ్రమ పునరుద్ధరణకు సుప్రీం అనుమతి

ABOUT THE AUTHOR

...view details