తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్చి 15 నుంచి సుప్రీంలో భౌతిక విచారణ - కరోనా మహమ్మారి కోర్టులు

భౌతికంగా విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈనెల 15 నుంచి విచారణను భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం.. మార్గదర్శకాలను విడుదల చేసింది.

supreme court
మార్చి 15 నుంచి సుప్రీంలో భౌతిక విచారణ ప్రారంభం

By

Published : Mar 6, 2021, 3:17 PM IST

మార్చి 15 నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణ భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా గతేడాది మార్చి నుంచి ‌అత్యున్నత న్యాయస్థానంలో కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతూ వస్తోంది. కేసులు దాదాపు పూర్తిగా తగ్గుముఖం పట్టిన వేళ నేరుగా కేసులు విచారించాలని నిర్ణయించిన సుప్రీం అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

మంగళవారం, బుధవారం, గురువారం జరిగే సాధారణ, తుది విచారణలను మార్చి 15 నుంచి ప్రయోగాత్మకంగా భౌతికంగా చేపట్టనుంది. కోర్టు హాల్​లో పరిమిత సంఖ్యలో జనం ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ విధానం సురక్షితమని భావిస్తే క్రమంగా మిగిలిన రోజుల్లో కూడా భౌతిక విచారణలు చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి :తమిళనాట 'షా' ఇంటింటి ప్రచారం- కేరళలో విజయ యాత్ర

ABOUT THE AUTHOR

...view details