లఖింపుర్ ఖేరిలో రైతులను కారుతో ఢీ కొట్టిన ఘటనపై(Lakhimpur Kheri case) విచారణను హైకోర్టు మాజీ న్యాయమూర్తితో జరిపించాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ల పేర్లను ఇందుకు సిఫారసు చేసింది. దీనిపై యూపీ ప్రభుత్వం శుక్రవారంలోగా స్పందన తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ వాయిదా వేసింది(lakhimpur kheri supreme court ).
ఈ కేసులో యూపీ ప్రభుత్వ విచారణ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు తాము ఆశించినట్లుగా జరగడం లేదని వ్యాఖ్యానించింది. విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు నిరాకరించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రోజు వారీ విచారణను పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. మరికొందరు సాక్షులను విచారించినట్లు తెలపడం తప్ప ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు సమర్పించిన స్ధాయి నివేదికలో ఏమీ లేదని తెలిపింది. పది రోజులు సమయం ఇచ్చినా ల్యాబ్ నివేదిక కూడా అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో(lakhimpur kheri incident) ఎంత మందిని అరెస్టు చేశారు, ఏ అభియోగాలు నమోదు చేశారో స్ధాయి నివేదికలో వివరించాలని సుప్రీం ధర్మాసనం యూపీ సర్కార్‌కు సూచించింది. ఈ కేసులో నమోదు చేసిన రెండు F.I.Rలు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను రక్షించేలా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. రెండు F.I.Rలను వేర్వేరుగా విచారించాలని సూచించింది. నిందితుల ఫోన్ కాల్ వివరాలు ఇవ్వాలని యూపీ సర్కార్‌కు ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది(supreme court on lakhimpur kheri).