తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవినీతి కేసులో యడియూరప్పకు ఊరట - అక్రమ భూమి డినోటిఫికేషన్‌ కేసులో యడియూప్పకు ఊరట

అక్రమ భూమి డినోటిఫికేషన్‌కు సంబంధించిన అవినీతి ఆరోపణ కేసులో కర్ణాటక సీఎం బీఎస్​ యడియూరప్పకు ఊరట లభించింది. ఆయనపై విచారణ జరపాలంటూ.. ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

CM B S Yeddyurappa
బీఎస్​ యడియూరప్ప

By

Published : Apr 5, 2021, 3:56 PM IST

అవినీతి కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్పకు ఊరట లభించింది. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి అక్రమంగా భూమిని డినోటిఫై చేశారనే ఆరోపణలపై విచారణ జరపాలని ట్రయల్​ కోర్టును ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

క్రిమినల్​ కేసును కొట్టివేయాలన్న పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు యడియూరప్ప. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది.

కేసు వివరాలు..

2008-12 మధ్య సీఎంగా ఉన్న యుడియూరప్ప.. పారిశ్రామిక అవసరాల కోసం బెంగళూరులోని హువినాయకనహళ్లి గ్రామంలో 20 ఎకరాల కేఐఏడీబీ భూమిని చట్టవిరుద్ధంగా డీనోటిఫై చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి:'నక్సలిజంపై విజయం తథ్యం'

ABOUT THE AUTHOR

...view details