ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్‌పై(Yashraj films news) సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'ఫ్యాన్' సినిమా (Shahrukh khan fan movie) ట్రైలర్లో చూపించిన 'జబ్రా ఫ్యాన్' అనే పాట.. సినిమాలో ఎందుకు లేదని ప్రశ్నించింది.
ఓ మహిళ ఫిర్యాదుతో.. నిర్మాణ సంస్థ రూ. 15 వేలు పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) ఆదేశించగా, దానిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది యష్‌రాజ్ ఫిలిమ్స్(Yashraj films news). దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నిర్మాణ సంస్థకు చురకలు అంటించింది. సినిమాలో లేనప్పుడు.. అదే పాటతో ప్రచారం ఎలా నిర్వహిస్తారని నిలదీసింది.
''సమస్య ఏంటంటే.. మీరు (నిర్మాణ సంస్థ) సినిమాలో లేనిదేదో ట్రైలర్లో చూపిస్తారు. ట్రైలర్ విడుదల అయిందంటే.. అది సినిమా ట్రైలర్ అనే అర్థం. ఇది.. సినిమా ప్రచారానికి ఉద్దేశించింది అని మీకు తెలిసినపుడు.. పాటతో మీరు సినిమాను ఎందుకు ప్రచారం చేయాలి?''
- సుప్రీం కోర్టు
అసలేం జరిగింది..?
మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన అఫ్రీన్ ఫాతిమా జైదీ అనే ఉపాధ్యాయురాలు.. 2016లో ఫ్యాన్ సినిమా (Shahrukh khan fan movie) గురించి నిర్మాణ సంస్థపై (Yashraj films news) జిల్లా వినియోగదారుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 'జబ్రా ఫ్యాన్' అనే పాట ట్రైలర్లో చూసి, తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్తే.. అది లేదని తెలుసుకొని మోసపోయామని చెప్పింది. అయితే.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆమె ఫిర్యాదు తిరస్కరణకు గురైంది.