కరోనా టీకాకు సంబంధించి దిల్లీ, బాంబే హైకోర్టుల్లో ఉన్న కేసుల విచారణపై స్టే విధించింది సుప్రీం కోర్టు. టీకా కేసులన్నీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రంతో పాటు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డో నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టీకా తయారీ సంస్థల అభ్యర్థన మేరకు.. హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న టీకా కేసులన్నింటినీ తనకు బదిలీ చేసుకుంది సర్వోన్నత న్యాయస్థానం.