మాస్కు ధరించని వారు కొవిడ్-19 కేర్ సెంటర్స్‌లో పనిచేసేలా గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్న గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ సుభాశ్ రెడ్డి, జస్టిస్ ఎమ్.ఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చింది కఠినమైన ఆదేశాలని పేర్కొంది.