ఝార్ఖండ్‌లోని జిల్లా అదనపు న్యాయమూర్తి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. జుడీషియల్ అధికారులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.
వారంలోగా నివేదిక..
ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఝార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఝార్ఖండ్ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ స్పష్టం చేశారు.
బుధవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్‌ను.. దుండగులు ఆటోతో వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:జడ్జి హత్యపై దుమారం- అసలు కారణాలేంటి?