తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కల్పించాలంటే అలా చేయాల్సిందే' - supreme court

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్​లో ఉంచింది. అయితే.. ఆయా రాష్ట్రాలు అనుసరించే విధంగా ఒక కచ్చితమైన, నిర్దిష్టమైన విధానాన్ని సుప్రీంకోర్టు తీసుకురావాలని కేంద్రం కోరింది.

SC reserves judgement on issue of grant of reservation in promotion to SCs/STs
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు

By

Published : Oct 26, 2021, 3:09 PM IST

Updated : Oct 26, 2021, 7:55 PM IST

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కేంద్రం కోరింది. ఆయా రాష్ట్రాలు అనుసరించే విధంగా.. కచ్చితమైన, నిర్దిష్టమైన ఒక విధానం తీసుకురావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​.. ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉన్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని దాఖలైన పిటిషన్​పై మంగళవారం విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం. జస్టిస్​ నాగేశ్వర్​రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత.. తీర్పును రిజర్వ్​ చేసింది.

వేర్వేరు రాష్ట్రాల తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​, అడిషనల్​ సొలిసిటర్​ జనరల్​ బల్బీర్​ సింగ్​, ఇతర సీనియర్​ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్​ 6న సుప్రీంకు తెలిపింది. ఇది వాస్తవమని, దీనిని పరిష్కారంగా సుప్రీంకోర్టే తగిన ప్రతిపాదనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించింది. ఆయా రాష్ట్రాలే.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని అప్పుడు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి: 'ప్రతిభలో వారిని సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నాం'

Last Updated : Oct 26, 2021, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details