తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో 8 దశల పోలింగ్​పై వ్యాజ్యం కొట్టివేత - బంగాల్​ భాజపా అభ్యర్థి, మాజీ ఐపీఎస్​ అధికారిణికి నాన్​బెయిలబుల్​ అరెస్ట్​ వారెంట్ జారీ

బంగాల్​లో ఎనిమిది దశల పోలింగ్​ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేతలు జైశ్రీరాం అని నినదించడంపైనా నిషేధం విధించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

SC rejects plea challenging EC's decision to hold WB Assembly polls in eight phases
బంగాల్​ ఎన్నికలపై దాఖలైన పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం

By

Published : Mar 9, 2021, 1:55 PM IST

బంగాల్​లో 8 దశల్లో పోలింగ్​ నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్​(ఈసీ) నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయమై సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని వ్యాజ్యం వేసిన న్యాయవాది ఎంఎల్​ శర్మకు సూచించింది.

అయితే.. నోటిఫికేషన్​ జారీ అయ్యాక హైకోర్టుకు వెళ్లలేమని పిటిషనర్​ వాదించగా.. దీంతో ఏకీభవించలేమంటూ పిటిషన్​ను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం.

భాజపా అభ్యర్థికి ఊరట

బంగాల్​ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్​ అధికారి భారతీ ఘోష్​కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హింసకు సంబంధించిన కేసులో ఆమెపై దాఖలైన నాన్​-బెయిలబుల్​ అరెస్ట్ వారెంట్​పై శాసనసభ ఎన్నికలు ముగిసేవరకు స్టే విధించింది.

డెర్బా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి హుమాయున్​ కబీర్​పై భారతి పోటీ చేస్తున్నారు. టీఎంసీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోందని, 2019 ఎన్నికల్లో హింస కేసు ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు భారతి. ఎన్నికలు ముగిసేవరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం... రెండు నెలల తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చదవండి:మిథున్‌ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!

ABOUT THE AUTHOR

...view details