Supreme court on GATE: గేట్-2022 పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. 48 గంటల ముందు పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేమని తేల్చిచెప్పింది.
గేట్ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే వీరిలోని 20వేల మంది విదార్థులకుపైగా పరీక్షను వాయిదా వేయాలని ఆన్లైన్ పిటిషన్లో సంతకాలు చేశారు. దీని ఆధారంగా సుప్రీంలో వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా వేస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని తెలిపింది.