10వ, 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు(cbse board exam 2021) హాజరయ్యేందుకు హైబ్రిడ్ మోడ్ అవకాశం కల్పించేలా సీబీఎస్ఈ, సీఐఎస్సీఈలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో కలగజేసుకుని, మొత్తం ప్రక్రియను చెడగొట్టటం సరికాదని తెలిపింది.
కరోనా మహమ్మారి(Corona virus) కొనసాగుతున్న క్రమంలో ఆఫ్‌లైన్‌లో(Online exams) మాత్రమే కాకుండా హైబ్రిడ్ పద్ధతిలోనూ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆరుగురు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్య ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నారనే నమ్ముతున్నట్లు పేర్కొంది.