SC ST Reservation in Promotion: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపునకు కొలమానాలు తేల్చడంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఆయా రాష్ట్రాలే పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది జస్టిస్ నాగేశ్వర్రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.
చివరగా గతేడాది అక్టోబర్ 26న విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసింది.
ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరిన కేంద్రం.. ఆయా రాష్ట్రాలు అనుసరించే విధంగా కచ్చితమైన, నిర్దిష్టమైన ఒక విధానం తీసుకురావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉన్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు.
'75 ఏళ్లయినా న్యాయం చేయలేకపోతున్నాం..'