దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను (NEET result 2021) వెలువరించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) సుప్రీంకోర్టు అనుమతించింది. బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గావయ్లతో కూడిన ధర్మాసనం (NEET SC hearing) తీర్పు చెప్పింది.
మహారాష్ట్రలోని ఓ సెంటర్లో ఇద్దరు అభ్యర్థుల ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారు అయిన నేపథ్యంలో వీరిద్దరికీ మరోసారి పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు అక్టోబర్ 20న ఆదేశించింది. అప్పటివరకు నీట్ ఫలితాలను నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది.
ఇద్దరి కోసం ఆపలేం: సుప్రీం