సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.. రైతులతో శుక్రవారం మరోసారి చర్చలు జరిపింది. బంగాల్ సహా మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన 12 రైతు సంఘాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. కొత్త సాగు చట్టాల అమలు పరిష్కారం కోసం.. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీతో ఇప్పటివరకు ఏడుసార్లు భేటీ అయ్యాయి రైతు సంఘాలు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పీఓ) పాల్గొన్నాయనని ఓ ప్రకటనలో తెలిపింది సుప్రీం ప్యానెల్. ఇందులో ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్‌కు చెందిన 12 రైతు సంఘాలు పాల్గొన్నట్టు పేర్కొంది. ఈ భేటీలో రైతులు తమ విలువైన అభిప్రాయాలు, సలహాలను ఇచ్చారని స్పష్టం చేసింది.