SC on Sex workers: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారు. వైరస్ ప్రభావం సెక్స్‌వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే జీవనాధారంగా బతుకుతున్న లక్షల మంది రోడ్డున పడ్డారు. వీరిలో రేషన్ కార్డులు కూడా ఉండనివారెందరో. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కనీసం రేషన్ బియ్యానికి కూడా నోచుకోలేక పోతున్నారు. అలాంటి వారందరికీ న్యాయం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్ కార్డు లేకపోవడాన్ని మానవ తప్పిదంగా పరిగణించి వారం రోజుల్లోగా వారికి అవసరమైన రేషన్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వారికి సాయం చేయాలని కేంద్రానికి సూచించింది.
Sex workers Supreme court news