సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ శాంతనగౌడర్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఈ మేరకు సుప్రీంలో సోమవారం కేసుల విచారణను రద్దు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ఈ కేసుల విచారణను మంగళవారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
జస్టిస్ శాంతనగౌడర్ మృతి పట్ల సుప్రీంకోర్టు సంతాపం - శాంతనగౌడర్ మృతిపై ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శాంతనగౌడర్ మృతి పట్ల.. అత్యున్నత ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంతాపం తెలిపారు. సుప్రీంలో సోమవారం కేసుల విచారణను వాయిదా వేశారు.
![జస్టిస్ శాంతనగౌడర్ మృతి పట్ల సుప్రీంకోర్టు సంతాపం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11540900-thumbnail-3x2-sc--judge.jpg)
సుప్రీం కోర్టు, జస్టిస్ శాంతన గౌడర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం. శాంతనగౌడర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి:కరోనా సోకిందని భార్య గొంతు కోసి చంపిన భర్త