తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనాభా పెరుగుదలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు - ఒక రోజుల్లో చిన్నారుల జననాలు

SC on population control : జనాభా పెరుగుదలను నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సుప్రీం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

sc notices on central government
సుప్రీంకోర్టు

By

Published : Sep 2, 2022, 1:01 PM IST

SC on population control : జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ కేఎమ్​ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది.

అఖిల భారతీయ సంత్​ సమితి ప్రధాన కార్యదర్శి దండి స్వామి జితేంద్రనంద్​ సరస్వతి.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతోందని.. అయితే సహజ వనరులు మాత్రం పరిమితంగా ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. అధిక జనాభా వల్ల నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతున్నాయని అన్నారు జితేంద్రనంద్ సరస్వతి.

ప్రస్తుతం భారత్​ జనాభా 139 కోట్లు అని, ఇది ప్రపంచ జనాభాలో 17.8 శాతం అని పిటిషన్​లో ప్రస్తావించారు. కానీ దేశంలో వ్యవసాయ భూమి 2శాతమే ఉందని గుర్తు చేశారు. అమెరికాలో రోజుకు 10,000 మంది చిన్నారులు జన్మిస్తుండగా.. భారత్‌లో రోజుకు 70,000 మంది పుడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:పన్నీరు సెల్వంకు షాక్​.. అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే

భారత నేవీలోకి స్వదేశీ యుద్ధనౌక 'విక్రాంత్'.. జాతికి అంకితమిచ్చిన మోదీ

ABOUT THE AUTHOR

...view details