తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎమర్జెన్సీ' వ్యాజ్యంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - 1975 ఎమర్జెన్సీ

1975 ఎమర్జెన్సీపై దాఖలైన పిటిషన్​పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై స్పందించాలని ఆదేశించింది. నాటి ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ 94ఏళ్ల వృద్ధురాలు ఈ పిటిషన్​ వేశారు.

SC notice to Centre on plea seeking to declare 1975 Emergency as “wholly unconstitutional”
'ఎమర్జెన్సీ' వ్యాజ్యంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

By

Published : Dec 14, 2020, 3:13 PM IST

1975 ఎమర్జెన్సీ "పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం" అని ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 94ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన జస్టిస్​ ఎస్​కే కౌల్​ నేతృత్వంలోని ధర్మాసం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎమర్జెన్సీ విధించిన 45ఏళ్ల తర్వాత దాని చెల్లుబాటుపై విచారణ చేపట్టడం అవసరమా? అసలు సాధ్యమేనా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు అసలు వచ్చి ఉండకూడదని అభిప్రాయపడింది.

ప్రజల హక్కులను హరిస్తూ విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు పిటిషనర్​ వీర సారిన్​ తరఫు న్యాయవాది హరీశ్​ సాల్వే. ఎమర్జెన్సీని మోసంగా పరిగణించాలన్నారు.

1975 జూన్​ 25, నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించారు. 1977మార్చ్​ నెలలో ఎత్తివేశారు.

ఇదీ చూడండి:-రైల్వేస్టేషన్​లో యువతిపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details