తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - ఎన్నికల సమయంలో దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల పోస్టల్​ ఓటు హక్కును కోరుతున్న హ్యజ్యం

ప్రస్తుతం కొద్దిమందికే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్ ఓటు​​ వ్యవస్థను సుదూరంలో ఉన్న వ్యక్తులందరికీ విస్తరించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్​ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై స్పందించాలని కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.

SC notice to Centre on plea for voting rights to people stationed outside their constituencies
పోస్టల్​ బ్యాలెట్​ ఓటు హక్కు వ్యాజ్యంపై కేంద్రానికి సుప్రీం ఉత్తర్వులు

By

Published : Feb 18, 2021, 6:32 PM IST

సొంత నియోజకవర్గం నుంచి దూరంగా ఉండే వారికి పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కు కల్పించడంపై దాఖలైన పిటిషన్​పై స్పందించాలని.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు అందించింది సుప్రీంకోర్టు. ఎన్​ఆర్​ఐలకు కూడా దీనిని వర్తింపజేయడంపై స్పందించాలని స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్​ తరుపున వాదనలు వినిపిస్తూ న్యాయవాది కాళేశ్వరం రాజ్​..ప్రస్తుతం కొద్ధి మందికే పోస్టల్​ బ్యాలెట్​ను వినియోగించుకునే సౌకర్యం కలదని ధర్మాసనానికి విన్నవించారు. చాలాకాలంగా వలసవాదులు ఓటు హక్కుకు దూరమవుతున్నారన్నారు.

బయటి దేశాల్లో ఉన్న విద్యార్థులు, ఎన్​ఆర్​ఐలు, ఇంకా ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి బయట ఉన్న వ్యక్తుల ఓటింగ్​ హక్కులను కోరుతూ ఎస్​. సత్యన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమ నియోజకవర్గం వెలుపల ఉన్న రిజిస్టర్డ్ ఓటర్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం లేదా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిట్ పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థను విస్తరించాలని పిటిషన్​లో కోరారు.

ఇదీ చదవండి:ఈసారి కుంభమేళా నెల రోజులే

ABOUT THE AUTHOR

...view details