అధిక ఓట్లు నోటాకు వస్తే.. ఆ ఎన్నికలను రద్దు చేయాలని దాఖలైన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టు ఎన్నికల సంఘంతో పాటు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
'నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు?' - maximum votes for NOTA
నోటాకు అధిక ఓట్లు వస్తే ఆ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ భాజపా నేత ఒకరు.. సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపించింది.
'నోటాకు ఎక్కువ వస్తే ఏం చేయాలో చెప్పండి'
భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. నోటాకు మెజార్టీ ఓట్లు వచ్చి తర్వాత ఆ ఎన్నికలను రద్దు చేయాలని, అనంతరం మళ్లీ నిర్వహించాలని కోరారు. అయితే.. కొత్త జరిపే ఎన్నికల్లో ఇంతకుముందు పోటీ చేసిన రాజకీయ పార్టీలు పాల్గొనకుండా ఆదేశించాలని అభ్యర్థించారు.
ఈ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.