సుప్రీంకోర్టులో ఒకే మహిళా న్యాయమూర్తి ఉండటం ఆందోళనకరమని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఈ పరిస్థితిపై సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దిల్లీలో శనివారం నిర్వహించిన జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక్క మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం. ఈ పరిస్థితిని సమీక్షించి, చర్యలు చేపట్టాలి. ప్రజలను ప్రభావితం చేసే ఈ న్యాయవ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు మనం కృషి చేయాలి. దీని వల్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. న్యాయవృత్తిలో మహిళల ఎదుగుదలకు వీలు ఉండే వాతావరణాన్ని కల్పించాలి."