సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి వాయు మార్గం ద్వారా దిల్లీకి తరలించారు. ఛాతిలో నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యం కోసం జస్టిస్ షాను దిల్లీకి తరలించే విషయంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నట్లు తెలిసింది.
అయితే.. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని జస్టిస్ షా స్పష్టం చేశారు.
"నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. రెండ్రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా తిరిగొస్తా. "