కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి సుప్రీంకోర్టులో వర్చువల్‌గా జరుగుతున్న విచారణల స్థానంలో భౌతిక విచారణ మొదలుకానుంది. మరో 10 రోజుల్లో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తెలిపింది. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ప్రకటించిన టారిఫ్ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా భౌతిక విచారణల గురించి ప్రస్తావించింది.
వర్చువల్ పద్ధతిలో విచారణల వల్ల కొన్నిసార్లు న్యాయవాదులను చూడలేకపోతున్నామని, వారి వాదనలు సరిగా వినిపించడం లేదని ధర్మాసనం తెలిపింది. మరో వారం పది రోజుల్లో భౌతిక విచారణను ప్రారంభిస్తామని జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు.
సమాధానం ఇవ్వండి..