ఎన్నికల బ్యాలెట్, ఈవీఎంలో పార్టీల గుర్తులకు బదులు అభ్యర్థుల వివరాలు ఉంచాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
'ఈవీఎంపై గుర్తులకు బదులు అభ్యర్థుల వివరాలు'
ఎన్నికల బ్యాలెట్, ఈవీఎంలో పార్టీల గుర్తులకు బదులు అభ్యర్థుల వివరాలు ఉంచాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ వివరాలను మొదట కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని, కానీ ఎలాంటి స్పందనలేదని పిటిషనర్.. కోర్టుకు తెలిపారు. దాంతో పిటిషన్ కాపీని అటార్నీ జనరల్, సొలిసిటరీ జనరల్‌కు సమర్పించాలని సీజేఐ సూచించారు.
'ఎన్నికల బ్యాలెట్, ఈవీఎంలపై పార్టీ గుర్తులొద్దు'
దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చినా స్పందన లేదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. కోర్టుకు తెలిపారు. దాంతో పిటిషన్ కాపీని అటార్నీ జనరల్, సొలిసిటరీ జనరల్‌కు సమర్పించాలని సీజేఐ సూచించారు.
ఇదీ చూడండి:ఆర్ఎస్ఎస్ విస్తరణే లక్ష్యంగా ఏబీపీఎస్ సభ