గతేడాది జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలని దాఖలైన పిటిషిన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను తప్పుపట్టింది. ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించకపోవడానికి గల కారణాలు, ఆ నిర్ణయం ఎవరి స్థాయిలో తీసుకున్నారో అనే సమాచారాన్ని అఫిడవిట్లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం తీరుపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎంతో మందిపై ప్రభావం చూపే ఈ నిర్ణయం ఏ స్థాయి వ్యక్తులు తీసుకున్నారో చెప్పలేదని పేర్కొంది. దీనిపై తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
'సివిల్' పరీక్షలు: కేంద్రం తీరుపై సుప్రీం అసహనం - సివిల్ సర్వీస్ పరీక్షలు
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించకపోడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ స్థాయి వారు తీసుకున్నారో అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది.
కరోనా కారణంగా సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరుకాలేకపోయినా వారికి మరో ఆవకాశం ఇవ్వాలని ఆశావహులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపంది. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆశావహులకు మరో అవకాశం కల్పించడం ద్వారా ముందు రాసిన వారికి అన్యాయం జరుగుతుందని వివరించింది. ఇలా చేయడం వ్యవస్థ పని తీరుకు హనికరమని తెలిపింది. ఈ నిర్ణయం ఏ స్థాయి వారు తీసుకున్నారు అనే విషయం తెలియజేయడం లో నిర్లక్ష్యం వహించిందని న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చూడండి: 'హింసను ప్రేరేపించే వార్తా ప్రసారాలపై చర్యలేవి?'