తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 5:56 PM IST

Updated : Jan 20, 2021, 6:14 PM IST

ETV Bharat / bharat

ఆధార్​ చెల్లుబాటుపై సమీక్షకు సుప్రీం నిరాకరణ

SC dismisses pleas seeking review of its 2018 verdict upholding Centre's flagship Aadhaar scheme as constitutionally valid
ఆధార్​ చెల్లుబాటుపై సమీక్షకు సుప్రీం నిరాకరణ

17:52 January 20

ఆధార్​ చెల్లుబాటుపై సమీక్షకు సుప్రీం నిరాకరణ

ఆధార్​ రాజ్యాంగబద్ధమేనంటూ 2018లో ఇచ్చిన తీర్పుపై సమీక్షించాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈమేరకు నిర్ణయం ప్రకటించింది. అయితే ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ డీవై చంద్రచూడ్​ మాత్రం ఇతర న్యాయమూర్తుల అభిప్రాయంతో విభేదించారు. 

ఐటీ రిటర్నులు, పాన్ ‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పని సరిచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ 2018లో కేంద్రం తీర్పు వెలువరించింది. అయితే బ్యాంకు ఖాతాలు,మొబైల్​ కనెక్షన్లు తీసుకునేందుకు అది అవసరం లేదని తెలిపింది. సీబీఎస్​ఈ, నీట్, జేఈఈ, యూజీసీ ప్రవేశ పరీక్షలు, పాఠశాలల్లో ప్రవేశాలు, ఉచిత విద్య కోసం కూడా ఆధార్‌ అవసరం లేదని తెలిపింది. సంక్షేమ పథకాలు,ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆధార్‌ అవసరమే అని 2018 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై విచారణకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించింది.

Last Updated : Jan 20, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details