కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు గతంలో కొట్టివేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కొనసాగించవచ్చంటూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరీ, జస్టిస్ అనిరుధ్ బోస్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
"సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేం. కనీస పరిశోధన చేయకుండా పిటిషనర్లు కావాలనే ఈ ప్రాజెక్ట్‌పై వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది."