దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ వద్ద ఉన్న వలస చిన్నారుల సంఖ్య, వారి స్ధితిగతులపై సమాచారం అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా నేపథ్యంలో వలస చిన్నారుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు దీని విచారణలో భాగస్వాములు కావాలని కూడా సుప్రీం ధర్మాసనం రాష్ట్రాలను ఆదేశించింది.
'వలస చిన్నారుల సమాచారం ఇవ్వండి' - వలస చిన్నారులు
అన్ని రాష్ట్రాలు తమ వద్ద ఉన్న వలస చిన్నారుల సంఖ్య, వారి స్థితిగతులపై సమాచారం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. కొవిడ్ నేపథ్యంలో వారి ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల వలస చిన్నారులపై చాలా ప్రభావం పడిందని పిటిషనర్ సుప్రీంకోర్టుకు వివరించారు. వలస చిన్నారుల్లో సున్నితమైన వారు కూడా ఉన్నారని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం అందజేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరించినా, సహాయ శిబిరాలు, క్వారంటైన్ కేంద్రాల్లోని మహిళలు, చిన్నారులకు అందించిన సాయం గురించి ఎలాంటి నివేదిక వెల్లడించలేదని గుర్తుచేశారు.
ఇదీ చూడండి:సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?