కొవిడ్-19 మార్గదర్శకాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం వంటి నియమాలను నిక్కచ్ఛిగా అమలు చేసేందుకు కొన్ని సలహాలు ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది.
కొవిడ్-19 రోగులకు హిమాచల్ ప్రదేశ్‌లో అందిస్తున్న వైద్యంపై కోర్టు ఆరా తీసింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దృశ్యమాధ్యమ వేదికగా తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హిమాచల్ ప్రభుత్వం.. కొవిడ్ రోగులకు సరైన ఏర్పాట్లు చేయట్లేదని ఆగ్రహించింది.