తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిజరేషన్లకు 50% పరిమితిపై సుప్రీంలో వాదనలు - ఇందిరా సాహ్నీ తీర్పును పునఃపరిశీలన

1992 నాటి ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించరాదని విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించే అంశంపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రాలకు వారం గడువు ఇచ్చింది.

SC commences hearing whether Mandal verdict needs to be revisited
రిజరేషన్లపై రాష్ట్రాలకు సుప్రీం కోర్టు వారం గడువు

By

Published : Mar 15, 2021, 2:14 PM IST

దేశంలో రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి విధిస్తూ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించే అంశంపై విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రాలకు వారం గడువు ఇచ్చింది.

పిటిషనర్ల తరఫున వాదనలను సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాదర్ ప్రారంభించారు. 1992నాటి ఇందిరా సహానీ కేసు తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 11 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఇప్పటివరకు.. 5 ప్రత్యేక సందర్భాల్లో రాజ్యాంగ ప్రాధాన్యత దృష్ట్యా మాత్రమే నియమించారని గుర్తుచేశారు. పెద్దఎత్తున సంప్రదింపులు, చర్చల తర్వాత నాటి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు పలు రాష్ట్రాల న్యాయవాదులు సమయం కోరారు. వాదనలు విన్న ధర్మాసనం వారం గడువు ఇస్తున్నట్లు తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి.. ప్రత్యేక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని.. తమిళనాడు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రిజర్వేషన్ల నిగ్గుతేల్చనున్న సుప్రీంకోర్టు

ABOUT THE AUTHOR

...view details