దేశంలోని వివిధ హైకోర్టుల్లో (Supreme court news today) న్యాయమూర్తుల భర్తీ ప్రక్రియను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Supreme court chief justice) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వేగవంతం చేసింది. జడ్జిలుగా పదోన్నతులు కల్పించేందుకు మరో 16 మంది పేర్లను ఇప్పుడు కేంద్రానికి సిఫార్సు చేసింది.
బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టుల్లో వీరు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. 16 మందిలో ఆరుగురు న్యాయ అధికారులు.. మరో 10 మంది న్యాయవాదులు. ఈ మేరకు సుప్రీం కోర్టు(Supreme court news today) వెబ్సైట్లో వివరాలను పొందుపరిచారు.
నలుగురు జుడీషియల్ అధికారులు.. ఏఎల్ పన్సారే, ఎస్సీ మోరే, యూఎస్ జోషీ-ఫాల్కే, బీపీ దేశ్‌పాండే బాంబే హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఒడిశా హైకోర్టుకు వీరే..
- ఆదిత్య కుమార్ మహోపాత్ర(న్యాయవాది)
- మృగంక శేఖర్ సాహో(న్యాయవాది)
- రాధా క్రిష్ణ పట్నాయక్(న్యాయ అధికారి)
- శశికాంత మిశ్రా(న్యాయ అధికారి)
గుజరాత్‌కు
న్యాయవాదులు.. మౌనా మనీశ్ భట్, సమీర్ జే దవే, హేమంత్ ఎం. ప్రచ్ఛక్, సందీప్ ఎన్ భట్, అనిరుద్ధ ప్రద్యుమ్న మయీ, నిరల్ రష్మీకాంత్ మెహ్తా, నిశా మహేంద్రభాయి ఠాకూర్ గుజరాత్ హైకోర్టుకు జడ్జిలుగా వెళ్లనున్నారు.
న్యాయవాది సందీప్ మౌద్గిల్‌ను.. పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసింది.