తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5 హైకోర్టులకు 13 మంది న్యాయమూర్తులు - సుప్రీం కొలీజియం సిపార్సులు

దేశంలోని 5 హైకోర్టులకు 13 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు(Supreme Court Collegium News) చేసింది. అలాగే.. పంజాబ్‌, హరియాణా హైకోర్టులోని 10 మంది అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదముద్ర వేసింది. దీంతో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ కోసం ఇప్పటివరకు చేసిన సిఫార్సుల సంఖ్య 119కి చేరింది.

high courtes judges
హైకోర్టు న్యాయమూర్తులు

By

Published : Oct 9, 2021, 7:32 AM IST

దేశంలోని 5 హైకోర్టులకు 13 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium News) సిఫార్సు చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన కొలీజియం ఈనెల 6వ తేదీన సమావేశమైంది. రాజస్థాన్‌ హైకోర్టుకు అయిదుగురు, కర్ణాటక హైకోర్టుకు నలుగురు, కోల్‌కత్తా హైకోర్టుకు ఇద్దరు, మద్రాస్‌, అలహాబాద్‌ హైకోర్టులకు ఒక్కొక్కరి చొప్పున పేర్లను సిఫార్సు(Supreme Court Collegium News) చేసింది.

అలాగే ఈనెల 7న సమావేశమైన కొలీజియం పంజాబ్‌, హరియాణా హైకోర్టులోని 10 మంది అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదముద్ర వేసింది. దీంతో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ కోసం ఇప్పటివరకు చేసిన సిఫార్సుల(Supreme Court Collegium News) సంఖ్య 119కి చేరింది. తాజాగా న్యాయమూర్తి పదవుల కోసం కొలీజియం సిఫార్సు చేసిన వారిలో 12 మంది అడ్వొకేట్లు, ఒక జ్యుడీషియల్‌ అధికారి ఉన్నారు. కర్ణాటక హైకోర్టు జడ్జీలుగా నలుగురు అడ్వొకేట్లను కొలీజియం సిఫార్సు చేసింది. వారిలో అనంత్‌ రామనాథ్‌ హెగ్డే, చెప్పుదిరా మొన్నప్ప పూనాచ, సిద్దయ్య రాచయ్య, కె.శ్రీధరన్‌ హేమలేఖ ఉన్నారు. అడ్వొకేట్‌ జె.సత్యనారాయణ ప్రసాద్‌ను మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details