పరువు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెడుతూ నిర్ణయం తీసుకుంది. బెయిల్‌కు వ్యతిరేకంగా మృతుడి భార్య దాఖలు చేసిన ఫిర్యాదుకు ఈ మేరకు తీర్పునిచ్చింది. జిల్లా కోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది.
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన బావను 2017లో హత్య చేశాడు. తన చెల్లి.. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరు ఇంట్లోకి చొరబడి మహిళ భర్తను హత్య చేశారు. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి కాల్చారు. ఆ సమయంలో మహిళ ఆరు నెలల గర్భంతో ఉంది.