తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మనోభావాల కంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యం' - sc kanwar yatra uttar pradesh

కావడి యాత్రను పరిమిత సంఖ్యలో భక్తులతో నిర్వహించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల మనోభావాల కంటే ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యమివ్వాలని హితవు పలికింది.

supreme court
సుప్రీం కోర్టు

By

Published : Jul 16, 2021, 1:10 PM IST

పరిమిత సంఖ్యలో భక్తులతో కావడి యాత్రను నిర్వహించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మనోభావాల కంటే.. ప్రజల ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీనిపై జులై 19లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారిమన్​, జస్టిస్​ బీఆర్​ భార్గవి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

కొవిడ్​ నిబంధలను పాటిస్తూనే తాము పరిమిత సంఖ్యలో భక్తులతో కావడి యాత్రను నిర్వహించాలని యోచిస్తున్నామని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం చెప్పగా.. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే.. కావడి​ యాత్రలో భాగంగా.. హరిద్వార్​ నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చేందుకు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా సుప్రీంకోర్టుకు నివేదించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివిధ ప్రదేశాల్లో ట్యాంకర్ల ద్వారా గంగాజలాన్ని అందించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

డిజిటల్ విధానాన్ని తీసుకురావావాలి...

మరోవైపు... ఖైదీల బెయిల్​కు సంబంధించి.. ఓ సురక్షితమైన డిజిటల్​ విధానాన్ని దేశవ్యాప్తంగా రూపొందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి నివేదికను వెంటనే అందజేయాలని న్యాయస్థానం సెక్రటరీ జనరల్​ను ఆదేశించింది. ఈ నెలలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది.

తదుపరి ఆదేశాలిచ్చేవరకు..

జైళ్లలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విడుదల చేసిన ఖైదీలను.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సరెండర్​ చేయొద్దని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. మే 7నాటి ఆదేశాలకు అనుగుణంగా జైళ్లలో అమలు చేసిన నిబంధనల గురించి.. ఐదురోజుల్లోగా తెలియజేయాలని అన్ని రాష్ట్రాల హైపవర్డ్​ కమిటీలను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details