తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ కాలుష్యంపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు - దిల్లీ కాలుష్యం వార్తలు

దిల్లీని పొగమంచు ఆవరించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాయునాణ్యత నిర్వహణ కమిషన్​ కార్యకలాపాలు శుక్రవారం (ఇవాళ) నుంచి ప్రారంభించాలని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్ఫష్టం చేసింది.

sc-delhi
దిల్లీ కాలుష్యం

By

Published : Nov 6, 2020, 2:08 PM IST

దిల్లీ- జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్​సీఆర్​)లో కాలుష్యానికి సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఎలాంటి పొగమంచు చేరకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

వాయునాణ్యత నిర్వహణ కమిషన్​ కార్యకలాపాలు శుక్రవారం (ఇవాళ) నుంచి ప్రారంభించాలని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్ఫష్టం చేసింది. వాయు కాలుష్యానికి సంబంధించిన ఇతర అభ్యర్థనలను దీపావళి సెలవుల తర్వాత విచారిస్తామని తెలిపింది.

ఛైర్మన్ నియామకం..

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కమిషన్​ శుక్రవారం నుంచి పనిచేస్తుందని న్యాయస్థానానికి విన్నవించారు. ఇందుకు సంబంధించి కమిషన్​ సభ్యులను నియమించినట్లు తెలిపారు.

ఈ మేరకు ఎన్​సీఆర్​, దాని పరిసర ప్రాంతాల్లో వాయునాణ్యత నిర్వహణ కమిషన్​కు దిల్లీ మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.కుట్టీని ఛైర్మన్​గా కేంద్రం నియమించింది.

ఇదీ చూడండి:కాలుష్య నివారణ ఏకసభ్య కమిటీ రద్దు

ABOUT THE AUTHOR

...view details