కొవిడ్-19 నేపథ్యంలో 7,8 నెలలుగా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న వైద్యులకు విరామం ఇచ్చే విషయాన్ని పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. నిరంతరంగా పనిచేయడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
కొవిడ్ వైద్యులకు విరామం ఇవ్వరా? - Covid-19 doctor duty news updates
కరోనా వేళ గడిచిన కొన్ని నెలలుగా ప్రత్యేక సేవలందిస్తున్న వైద్యులకు విరామం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. విశ్రాంతి లేకుండా సేవలందించడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడింది.
కొవిడ్ వైద్యులకు విరామం ఇవ్వరా?
ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్సపై విచారిస్తున్న క్రమంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు సూచనను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ధర్మాసనానికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:నిరవధిక సమ్మె- ఎయిమ్స్ నర్సుల ఆందోళన