తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​పై కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు - వ్యాక్సిన్​లపై సుప్రీంకోర్టు

కరోనా వ్యాక్సిన్​ల కోసం అనేక రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్న క్రమంలో.. ఇది ప్రభత్వ విధానమా అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కరోనా రోగులకు అత్యవసర ఔషధాలు సరఫరాపై సుమోటోగా కేసు విచారణ జరిపింది. కొవిన్ యాప్​లో పేరు నమోదుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

supreme court
సుప్రీం కోర్టు

By

Published : May 31, 2021, 12:27 PM IST

కరోనా టీకాల కోసం రాష్ట్రాలు.. గ్లోబల్ టెండర్లపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ఇది ప్రభుత్వ విధానమా అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కరోనా రోగులకు అత్యవసర ఔషధాలు సరఫరాపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్​ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్​రావుతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది.

వారికి ఇబ్బందులు..

టీకా తీసుకోవాల్సిన వారు.. కొవిన్ యాప్​లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనలను సుప్రీం ప్రశ్నించింది. టీకా నమోదు ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడొచ్చని పేర్కొంది. టీకా నమోదు విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి.. ప్రజలకు అనుగుణంగా మార్చాలని సూచించింది.

ఫైజర్​తో చర్చలు..

ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. టీకాల కోసం అమెరికాకు చెందిన ఫైజర్​ సంస్థతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. చర్చలు ఫలిస్తే.. వ్యాక్సినేషన్​ పూర్తయ్యే గడువులో మార్పులు జరగవచ్చన్నారు.

ఇదీ చదవండి :దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలివే..

ABOUT THE AUTHOR

...view details