తదుపరి విచారణ జరిగే వరకు మహిళా అధికారులను సైన్యం నుంచి తొలగించవద్దని సుప్రీంకోర్టు(SC Order on Army) శుక్రవారం సైన్యాన్ని ఆదేశించింది. 72 మంది మహిళా షార్టు సర్వీసు కమిషన్ అధికారులను(Women Army) పర్మినెంట్ కమిషన్ అధికారులుగా తీసుకోవడానికి సైన్యం నిరాకరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ బివి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్మినెంట్ కమిషన్‌కు వారి పేరును ఎందుకు పరిశీలించలేదో వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని సైన్యాన్ని ఆదేశించింది.
'మహిళా అధికారులను వెంటనే తొలగించొద్దు' - మహిళా ఆర్మీ అధికారులు
మహిళా అధికారులను వెంటనే తొలగించొద్దని సైన్యానికి ఆదేశించింది సుప్రీంకోర్టు(SC Order on Army). 72 మంది మహిళా షార్టు సర్వీసు కమిషన్ అధికారులను(Women Army) పర్మినెంట్ కమిషన్ అధికారులుగా తీసుకోవడానికి సైన్యం నిరాకరించిన నేపథ్యంలో.. జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ బివి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అర్హులైన మహిళా అధికారులను పర్మినెంట్ కమిషన్‌కు అనుమతించాలంటూ మార్చి 25న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం మదింపు పరీక్షల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఆరోగ్యపరంగా దృఢంగా ఉండాలి. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉండకూడదు. ఈ అర్హతలు సాధించినా పేర్లను పరిశీలించలేదని, కారణాలు చెప్పకుండానే తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారని వారి తరఫున సీనియర్ న్యాయవాది వి.మోహన తెలిపారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాదనలు వినిపిస్తూ ప్రతి వారికి ఒకటి చొప్పున 72 కారణాలు ఉండవచ్చని తెలిపారు. వివరాలు తెలుసుకొని సమర్పిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:'వారిని న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదు'