ప్రజా ప్రతినిధులపై చిన్న నేరాలకు సంబంధించిన కేసుల(Minor offences on lawmakers) విచారణ కోసం ప్రత్యేక మేజిస్టీరియల్ కోర్టులు(Sc on special magesterial courts) ఏర్పాటు చేసేందుకుగాను నోటిఫికేషన్ విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టును(allahabad high court special judicial magistrate) సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర తీవ్రత ఆధారంగా.. ఈ కేసులను సెషన్స్ లేదా మేజిస్టీరియల్ కోర్టుకు కేటాయించాలని చెప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ తరహా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం చూస్తే.. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
చట్టసభ్యులపై నమోదైన చిన్న నేరాలకు సంబంధించి.. మేజిస్టీరియల్ కోర్టులు విచారించే ఈ కేసులను సెషన్స్ కోర్టు జడ్జి అధ్యక్షతన ప్రత్యేక కోర్టులో విచారణ జరపవచ్చా? అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులను సెషన్స్ జడ్జి విచారణ జరిపితే.. మేజిస్ట్రేట్ జడ్జి కంటే సెషన్స్ జడ్జి సీనియర్ అయినందున నిందితులు అప్పీళ్లు చేసుకునే ఆస్కారం లేకుండా పోతుందని పిటిషన్‌దారు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మేజిస్టీరియల్ కోర్టు విచారణ చేపట్టిన తర్వాత సెషన్స్ కోర్టుకు బదిలీ అయిన ఈ కేసులను తిరిగి మేజిస్టీరియల్ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టును ఆదేశించింది. విచారణను మేజిస్టీరియల్ కోర్టు ఎక్కడైతే విరమించిందో.. అక్కడి నుంచే మళ్లీ మొదలుపెట్టాలని చెప్పింది. 2019 ఆగస్టు 16న తాము ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది.