Indian Students in Ukraine: 'ఆపరేషన్ గంగ' పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్రం చేపడుతున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రశంసించింది. అయితే వారు వచ్చేవరకు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీరి కోసం ఆన్లైన్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించింది.
"చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోలేకపోవడం దురదృష్టకరం. యుద్ధాలతో ఎంతో నష్టం జరిగింది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. విద్యార్థుల తరలింపు ప్రక్రియపై ప్రస్తుతం మేము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోము. ఆ విద్యార్థులందరూ సురక్షితంగా చేరడంపైనే మా ఆందోళన."
-సుప్రీంకోర్టు