బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. దిల్లీ హైకోర్టు అయిదుగురు పేర్లను పంపించగా వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్లోతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.
బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు
బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి 41కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక జడ్డి భరత్ పరాషర్ ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉండగా.. కొత్త వారిని నియమించాల్సి వచ్చింది.
సుప్రీంకోర్టు
అందరూ మంచివారేనని పేర్కొన్న ధర్మాసనం వారిలో అరుణ్ భరద్వాజ్, సంజయ్ బన్సల్లను ఎంపిక చేసింది. 2014 నుంచి 41కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక జడ్డి భరత్ పరాషర్ ఆరేళ్ల పాటు అదే పదవిలో కొనసాగడంతో కొత్త వారిని నియమించాల్సి వచ్చింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున రెండు కోర్టులు ఏర్పాటు చేసి, ఇద్దరు ప్రత్యేక జడ్జీలను నియమించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. ఎస్. చీమా కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.