మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనిడిమాండ్ చేస్తున్న రైతు సంఘాలతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినకమిటీ.. సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ సహా8 రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలతో వర్చువల్‌గా భేటీ అయ్యింది.
'రైతు సంఘాల సభ్యులతో సమావేశమయ్యాం. సాగు చట్టాలపై వారి అనుకూల, వ్యతిరేక వాదనలను విన్నాం. వీటితో మెరుగైన చట్టాల రూపకల్పనకు కృషి చేస్తాం.' అని కమిటీ పేర్కొంది.
రైతులు వ్యతిరేకిస్తోన్న చట్టాల అమలును నిలిపేస్తూసుప్రీంకోర్టు ఈ నెల 11న స్టే విధించింది. ఈ అంశంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యుల్లో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ భేటీలో అనిల్ ఘన్వాత్‌తో పాటు.. డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషీ, అశోక్ గులాటీలు మాత్రమే పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్యానెల్ సభ్యులంతా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టు కమిటీపై రైతు సంఘాల పెదవివిరుపు