తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టెరిలైట్​ పరిశ్రమ పునరుద్ధరణకు సుప్రీం అనుమతి - ఆక్సిజన్​

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ఆక్సిజన్​ ఉత్పత్తి చేయడానికి తమిళనాడులోని వేదాంత సంస్థకు అనుమతినిచ్చింది సుప్రీం కోర్టు. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పరిశ్రమను తెరవాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

supreme court, Vedanta
సుప్రీం కోర్టు, వేదాంత సంస్థ

By

Published : Apr 27, 2021, 12:59 PM IST

తమిళనాడులో స్టెరిలైట్ పరిశ్రమ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని వేదాంత సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పరిశ్రమను తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం మాత్రమే పరిశ్రమ తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కలహాలకు అవకాశం ఇవ్వద్దొని పేర్కొంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇదీ చూడండి:మే 1న భారత్‌కు 'స్పుత్నిక్​ వి' టీకాలు

ABOUT THE AUTHOR

...view details